మహనీయుల కలలు సాకారం చేసిన జగనన్న

పేదవర్గాలు ధైర్యంగా బతికేలా చేసిన సీఎం జగన్‌: మంత్రి మేరుగ నాగార్జున

 ఎప్పుడూ చూడని కులాలను చట్టసభల్లోకి తెచ్చిన జగనన్న: మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఓటు వేయని వారికీ మంచి చేసే వ్యక్తి సీఎం జగన్‌: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

పేదలు ఎవరినీ దేహీ అని అడగాల్సిన పనిలేకుండా చేసిన జగనన్న: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి చాటిన నేత జగన్‌: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట: సామాజిక సాధికార యాత్రతో నరసరావుపేట దద్దరిల్లింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అశేష జనవాహిని వెంటరాగా నేతలంతా బస్సు యాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్‌ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇసకేస్తే రాలనంత జనంతో, జగన న్న నినాదాలతో నరసరావుపేట పులకించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు హఫీజ్‌ ఖాన్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. 

 

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..

– రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది.

– ఏపీలో ముందెన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొనేలా పాలన జరుగుతోంది. ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూస్తున్న జగనన్న.

– చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. జడ్జిలుగా బీసీలు పనికిరారన్నాడు.

– మహనీయులు కన్న కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయి.

– రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా ప్రజలకు ఇచ్చిన జగనన్న. ఆశ్రిత పక్షపాతం లేదు. అందులో 78 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు.

– 2.70 లక్షల ఉద్యోగాలిస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.

– పిల్లవాడు చదవాలంటే ఇంగ్లీషు మీడియం తెచ్చారు. పుస్తకాలు, బట్టల దాకా ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి.

– ఇదివరకు ప్రభుత్వాల్లో వైద్యం అనారోగ్యం బారినపడింది. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా చూపించుకొనేలా చేసిన జగనన్న. ఇంటికొచ్చాక ఖర్చులకూ డబ్బులిచ్చే సీఎం జగన్‌.

 

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ...

– ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. జగనన్న అన్నీ చేసి చూపించాడు.

– సాధికారతకు నిలువెత్తు సాక్ష్యం వేదికపై ఉన్నమేమే.

– మాదిగ సామాజికవర్గానికి చెందిన నన్ను మంత్రిగా చేశారు. మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రిగా, వెనుకబడిన వర్గాల వారిని మంత్రులుగా చేశారు.

– ఎప్పుడూ చూడని కొన్ని కులాలను చట్టసభల్లోకి తెచ్చిన ఘనత జగనన్నది.

– డప్పు, చర్మకారుల పింఛన్లు, నేతన్న నేస్తం లాంటివి బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చారు. ఇది కాదా సాధికారత?

– జగనన్న అంటే నమ్మకానికి కేరాఫ్‌ అడ్రస్‌. విశ్వసనీయతకు చిరునామా. 

– చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు. కోర్టులలో40–45 స్టేలు తెచ్చుకున్నాడు.

– అవినీతి రహితంగా, పారదర్శకంగా జవాబుదారీతనంతో సమర్థంగా పాలించే జగనన్న వచ్చాడు కాబట్టి బాబు ఆటలు సాగలేదు.

– పవన్‌ పెత్తందారీ పోకడలు మానుకోవాలి.

– ఇంగ్లీషు మీడియం మీ పిల్లలే చదవాలా? తెలుగుభాష కాపాడే బాధ్యత దళితులదా?

– ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఇంగ్లీషులో మాట్లాడుతున్న పరిస్థితి.

– పవన్‌.. సినిమాల్లో డైలాగులు కాదు, ప్రభుత్వ పాఠశాల్లలో చదివిన పేద పిల్లలతో నువ్వు వచ్చి ఇంగ్లీషులో మాట్లాడగలవా?

– ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మన విధానాలు హామీలుగా ఇస్తున్న పరిస్థితి. 

 

మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ....

 

– జగనన్న చెప్పినవి, చెప్పనివి కూడా చేశారు.

– కలెక్టర్ల మీటింగ్‌లో చంద్రబాబు.. మా వాళ్లకే చేయండి, మా వాళ్లనే చూసుకోండని అన్నారు. కానీ జగనన్న పార్టీలు, కులాలు, మతాలు చూడొద్దన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పథకం అందకుండా ఉండరాదని జగనన్న చెప్పారు.

– గడప గడపకూ వెళ్లినప్పుడు ఓ ఆవిడ ఎదురొచ్చింది. మేము పక్కా తెలుగుదేశం. ఓటు వేయలేదు, రూ.2.50 లక్షలు లబ్ధి వచ్చింది, రెండు కాసులు బంగారం కొన్నాం అంది. రేపు ఎన్నికల్లో నా భర్త, నేను, ఓటేసి రుణం తీర్చుకుంటామంది.

– వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని సినిమా యాక్టర్‌ అంటున్నాడు. జగనన్నకు వ్యతిరేక ఓటు లేదు.

– చదువుల్లో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మూడో స్థానానికి తెచ్చిన జగనన్న.

- పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గించారు. పౌష్టికాహార లోపాన్ని 24 శాతం ఉంచి 8 శాతానికి తగ్గించారు.

– నాడు–నేడుతో స్కూళ్లను ఆధునికంగా తీర్చిదిద్ది  రూ.15 వేలు అమ్మ ఒడి ఇస్తున్నారు.

– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇంగ్లీషు మీడియం వద్దంటున్నారు. వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదవాలి. మన పిల్లలు చదవొద్దా?

– జీడీపీ పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు పోతుంటే ఎల్లో మీడియా కావాలనే బురదజల్లుతోంది.

 

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ....

 

– గత ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలిచ్చి వెబ్‌సైట్లోంచి తీసేసింది. రైతులకు 10 శాతమో 20 శాతమో రుణమాఫీ చేసి తూచ్‌ అనిపించారు.

– బంగారం తాకట్టు నుంచి విడిపిస్తామని తూచ్‌ అనిపించారు.

– 2019 నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. 

–పేదలు ఎవరి దగ్గరకీ వెళ్లి దేహీ అని అడగాల్సిన పని లేదు.పథకాలు ఇంటికే తెచ్చి ఇస్తున్నాం.

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని జగన్‌ గారు గుండెల్లో పెట్టుకున్నారు.

– ప్రతి ఒక్క పదవిలో కచ్చితంగా మాట ఇచ్చి సామాజిక సాధికారత పాటించారు. 

 

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...

 

– ఎస్సీలు, బీసీలు, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న గత పాలకులు.

– 25 మంది మంత్రులుంటే 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న.

– 8 మంది రాజ్యసభకు వెళ్తే నలుగురు బీసీలకు, మండలి చైర్మన్‌ ఎస్సీకి ఇచ్చారు.

– సామాజిక న్యాయం అంటే ఏంటో దేశానికే కాదు, ప్రపంచానికే చాటి చెప్పిన జగనన్న.

– రాజ్యసభ సీట్లను కౌంటర్‌ ఓపెన్‌చేసి రూ.50 కోట్లు, 100 కోట్లకు బేరం పెట్టిన చంద్రబాబు.

– నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ఎవరైనా గతంలో చెప్పారా? 

– నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు రూ.560 కోట్లు డైరెక్ట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జమ చేశారు.

– రూ.280 కోట్ల ఇళ్ల స్థలాలు తదితర నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం రూ.830 కోట్లు ఇచ్చారు.

– నియోజకవర్గంలో 80 వేల  ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. 

– 65 సంవత్సరాల కల.. నరసరావుపేటను జిల్లా కేంద్రం చేయాలనే కోరికను వరమిచ్చి నెరవేర్చారు.

 

ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ మాట్లాడుతూ....

 

– ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు.. పవన్‌ కల్యాణ్‌కు 10 మంది వస్తే 100 మంది వచ్చారని, , చంద్రబాబుకు నలుగురు వస్తే 400 మంది వచ్చారని

చూపుతారు. సాధికార యాత్రకు ఇన్ని వేల మంది వస్తుంటే మాత్రం చూపించరు.

– జగనన్న తయారు చేసిన సైనికులు వస్తేనే ఇంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వచ్చారంటే జగనన్న బయటకు వస్తే టీడీపీ, పవన్‌ కల్యాణ్‌ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం.

– చంద్రబాబు అంటే మోసం, వెన్నుపోటు, 420. ఇది జనంలోకి వెళ్లిపోయింది. 

– జగనన్న అంటే మా నమ్మకం, మా అందరినీ బాగు చేసే పనిషి. పైన దేవుడు దాని తర్వాత మా తలరాతలు మార్చే వ్యక్తి ముఖ్యమంత్రి జగనన్న.

– ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ చేయాలని చూస్తున్నారు.

– పేద పిల్లలకు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటే కోటి రూపాయలైనా ఫీజు కడతానన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్‌ మాత్రమే. 

– ఆ కాలంలో సోషల్‌ మీడియా లేదు కాబట్టి ఈనాడు ఏది చెప్తే అది చెల్లింది.

– చంద్రబాబూ 10 స్కూళ్లయినా కట్టించావా? జగనన్న ఆధ్వర్యంలో వేలాది స్కూళ్లను బాగు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top