మంత్రి కన్నబాబుకు కేంద్రసహాయ మంత్రి కైలాష్‌చౌదరి ఫోన్‌

రాష్ట్రంలో వ్యవసాయరంగ సడలింపులపై ఆరా

అమరావతి: ఏపీలో వ్యవసాయరంగం సడలింపులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కేంద్ర సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే చర్యలు చేపట్టారని కేంద్రమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. "వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రమిచ్చిన సడలింపులు అమలు చేస్తున్నాం. మార్కెటింగ్‌ శాఖ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. పండ్లకు కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ చొరవ తీసుకున్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, ఆక్వారంగాలకు కూడా సడలింపులిచ్చాం. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం"అని కేంద్రమంత్రి కైలాష్‌ చౌదరికి మంత్రి కన్నబాబు వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top