మూడు దశాబ్దాల టీటీడీ ఉద్యోగుల కల నెరవేర్చిన సీఎం వైయ‌స్ జగన్‌

 
 తిరుపతి: ఇళ్ల స్థలాల కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న టీటీడీ ఉద్యోగుల కల త్వరలో సాకారం కానుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరో మూడు నెలల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం వడమాలపేట మండలం పాదిర్వేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమికి సంబంధించి చెల్లించాల్సిన రూ.61.63 కోట్ల మొత్తాన్ని గురువారం టీటీడీ చైర్మన్‌.. కలెక్టర్‌ హరినారాయణన్‌కు అందజేశారు.

శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 5,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే ఇళ్ల స్థలాల విషయమై అప్పటి బోర్డులో తీర్మానం చేశారని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ధర్మకర్తల మండలి హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులున్నారు.  
 

Back to Top