టీటీడీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ 

 నిత్యావసర వస్తువుల కిట్ల అందజేసిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

 చిత్తూరు:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పేదలకు అండగా నిలిచింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 5000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా పేదలకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..టీటీడీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్వామివారి దర్శనం నిలిపివేసినా..నిత్యం జరగాల్సిన పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో ఏపీ నంబర్‌ 1గా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు.  దక్షిణ కొరియా నుంచి 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇప్పటికే లక్ష కిట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. మండల స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనాకు మందు లేదని, సామాజిక దూరం ఒక్కటే మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

తాజా వీడియోలు

Back to Top