మంత్రుల‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శ‌

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా:  అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఏపీ మంత్రులు పెనిపే విశ్వ‌రూప్‌, ఆదిమూల‌పు సురేష్‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మోకాలి నొప్పికి మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. ఈమేర‌కు ఆయ‌న్ను క‌లిసి ఆరోగ్య ప‌రిస్థితిని వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అన్నారు. అలాగే ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి పినిపే విశ్వరూప్ ని ఆయ‌న నివాసంలో వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top