బాబు జగ్జీవన్ రామ్  జీవితం స్ఫూర్తిదాయకం

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

గుంటూరు: స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి  సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటైన ఆయ‌న  విగ్ర‌హానికి  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, అణ‌గారిన ప్రజల సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధులు  బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ముస్త‌ఫా, మ‌ద్ద‌లి గిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, యేసుర‌త్నం, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top