శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణకు రండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహాన‌ప‌త్రిక అంద‌జేత‌

అమ‌రావ‌తి: శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ‌ ప్రసాదాలు అంద‌జేశారు. అనంత‌రం విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజ‌రుకావాల్సిందిగా సీఎం వైయస్ జగన్‌కు టీటీడీ చైర్మ‌న్‌, దేవాదాయశాఖ మంత్రి, ఈవో, ఇతర అధికారులు ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top