సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారం చేయడం తగదు 

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 తిరుమల: సంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో‌ దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సోమ‌వారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్న‌ ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు.

తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్‌ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Back to Top