రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తూర్పు గోదావరి: రాజమండ్రిని రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా తీర్చిదిద్దుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో రుడా కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రాజమండ్రిలో మరో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిందని చెప్పారు. ఇప్పటికే 6 వేల మందికి టిడ్కో ఇళ్లు అందజేశామని గుర్తు చేశారు. పేద ప్రజలకు మేలు చేయడమే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top