‘ఆటా’కు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు

తాడేపల్లి: ప్రభుత్వానికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు విరాళంగా అందజేసిన అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ప్రతినిధులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆటా తన వంతు సాయంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. మొదటి విడతగా 50 కాన్సంట్రేటర్లను టీటీడీ చైర్మన్‌ వై.వీ సుబ్బారెడ్డికి ఆటా ప్ర‌తినిధులు అందించారు. ఈ సందర్భంగా వై.వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు తమవంతు సాయంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించిన ఆటా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top