శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆహ్వానించిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తాడేప‌ల్లి: ‌ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి  బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్ జగన్‌ను ఆహ్వానించారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెంట ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్, అడిషనల్ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top