ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ప్రసాదాలు పంపిణీ

శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పుడు అనుమతిస్తామో చెప్పలేం

దర్శనానికి అనుమతి లేకపోయినా ఆన్‌లైన్‌ హుండి ఆదాయం వస్తోంది

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భక్తులకు వెంకటేశ్వరస్వామి దర్శనం లేక ఇబ్బందులు పడుతున్నారని, శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పుడు అనుమతిస్తామో చెప్పలేమన్నారు. కరోనా కారణంగా ఎప్పటివరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియదన్నారు. దర్శనానికి అనుమతి లేకపోయినా ఆన్‌లైన్‌ హుండి ఆదాయం వస్తుందన్నారు. 2019 ఏప్రిల్‌ నెలలో ఈ-హుండి ఆదాయం కోటి 79 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది భక్తుల దర్శనం ఆపేసినా రూ.1.9 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. దర్శనాలు లేకపోయినా ఈ-హుండి ద్వారా భక్తులు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నారు. టీటీడీ కూడా భక్తులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎక్స్‌ట్రా లడ్డు కావాలనే రూ.50 విలువ ఉన్న లడ్డును రేటు తగ్గించి రూ.25లకే అందిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రసాదాలు అందజేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top