శ్రీవారికి యథావిధిగా కైంకర్యాలు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

తిరుమల: ప్రాణాంతక కరోనా నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ పాలక మండలి..స్వామి వారికి యధావిధిగా కైంకర్యాలు, సేవలు కొనసాగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా  ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు చేసిన విషయం విధితమే.  గత 20 రోజుల నుంచి కరోనా వ్యాధి నివారణకు,  వ్యాధి సోకిన ప్రజలు కూడా త్వరగా నయం అయ్యి కోలుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినప్పటికీ రోజు వారి జరగవలసిన కైంకర్యాలు, సేవలు యధావిధిగా జరుగుతున్నాయని చెప్పారు.  అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు

టీటీడీ ఆధ్వర్యంలో అన్నదానం
లాక్‌డౌన్‌ నేపథ్యంలో టీటీడీ పాలన మండలి ఆధ్వర్యంలో ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.   రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్‌, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది.     

తాజా వీడియోలు

Back to Top