తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపుతాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

తిరుమల: తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పీఆర్‌వోలమని చెప్పుకుంటూ ప్రజాప్రతినిధుల పేర్ల మీద కొందరు దళారీ వ్యవస్థను నడుపుతున్నారని విమర్శించారు. విచారణ జరిపి కొందరు దళారులను అరెస్టు చేశామన్నారు. కొందరు ప్రజాప్రతినిధుల లేఖలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఒక్కో టికెట్‌ను రూ.14-15 వేలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నిఘా పెట్టి కొంత మంది దళారులను పట్టుకున్నామన్నారు. 

Back to Top