అవినీతి లేని పాలనే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

ఒంగోలు: అవినీతి లేని పాలనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని నిగ్గు తేలుస్తామని హెచ్చరించారు. మరో రెండు వారాల్లో టీటీడీ పాలన మండలి ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవారి దర్శనాల విషయంలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శన విషయంలో పిఠాధిపతులు, పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

 

Back to Top