టీటీడీ ఆస్తులపై ప్రతిపక్షాల రాజకీయాలు దారుణం

సీఎం వైయస్‌ జగన్‌ శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పాడుతున్నారు

రేపు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ పాలక మండలి సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: కలియుగ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తులపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడటం దారుణమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ఆస్తులు విక్రయించాలని తీర్మానాలు చేసింది టీడీపీ పాలనలోని టీటీడీ పాలక మండలి కాదా..? అని ప్రశ్నించారు. గత బోర్డు చేసిన తప్పును మాపై రుద్ధి రాజకీయ లబ్ధిపొందాలని చూడడం దారుణమన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పాటుపడుతున్నారని చెప్పారు. అయినా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణమన్నారు. రేపు (గురువారం) జరగనున్న పాలక మండలి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు చెబితే అప్పుడు భక్తలకు స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తామన్నారు. స్వామివారి ప్రసాదాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, చాలా ప్రాంతాల వాసులు శ్రీవారి ప్రసాదాలు అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. పరిస్థితిని బట్టి ప్రసాదాలు అందిస్తామని, ప్రస్తుతం తిరుమలలో ఇంజనీరింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. 

Back to Top