గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి
 

హైద‌రాబాద్‌:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయ‌న అకాల మ‌ర‌ణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు. పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి  రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న‌ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Back to Top