చిన్న వ‌య‌స్సులో గౌత‌మ్‌రెడ్డి మ‌ర‌ణం చాలా బాధాక‌రం

తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులు
 

హైద‌రాబాద్‌:  చిన్న వ‌య‌స్సులో ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెంద‌డం చాలా బాధాక‌ర‌మ‌ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని గౌత‌మ్‌రెడ్డి స్వ‌గృహంలో ఆయ‌న భౌతిక‌కాయంపై కేటీఆర్ పుష్ప‌గుచ్చం ఉంచి నివాలుల‌ర్పించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. గౌత‌మ్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు భ‌గవంతుడు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థించారు. గౌత‌మ్‌రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని కేటీఆర్ వ్యక్తం చేశారు. త‌న‌కు గౌత‌మ్ రెడ్డి అత్యంత స‌న్నిహితుడ‌ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎలాంటి ఏర్పాట్లు కావాల‌న్నా ప్ర‌భుత్వం చేస్తుంద‌ని కేటీఆర్ మాటిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top