మ‌హాత్మా జ్యోతిరావు పూలేకు ఘ‌న నివాళులు

విజ‌య‌వాడ‌: సామాజికవేత్త, సంఘసంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. పూలే గారి విగ్రహానికి  మంత్రి జోగి రమేష్ ,ఎమ్మెల్యే మల్లాది విష్ణు ,నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ ,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి  ,ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీ రావు ,నగరపాలక సంస్థ కమిషనర్ స్వపనిల్ దినకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్ లు,డైరెక్టర్ లు,కార్పొరేటర్లు,నాయకులు,అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top