వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో మ‌హానేత‌కు ఘ‌న నివాళులు

నంద్యాల‌: న‌ల్వ‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఘ‌న నివాళుల‌ర్పించారు. 13వ వర్ధంతి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నల్ల కాలువ సమీపంలో వైయస్సార్ స్మృతి వనంలో వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, జోహార్ వైయస్ఆర్ నినాదాలతో  పార్టీ శ్రేణులు , నాయకులు  నివాళులర్పించారు.  ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి   మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చెరగని స్థానం పదిల పరుచుకున్న మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారికి మరణం లేదని అన్నారు.  ప్రజా సంక్షేమం కోరుతూ 2009 సెప్టెంబర్ 2 వ తేదిన రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో మాత్రం సజీవంగా నిలిచి ఉన్నారని కొనియాడారు. 2004, 2009 ఎన్నికల్లో విజయ ధుంధుభి మోగించిన స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారు 108 వంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే అత్యున్నత స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయారని శిల్పా భువనేశ్వర్ రెడ్డి  స్మరించుకున్నారు. కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల పార్టీ శ్రేణులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top