మాజీ రాష్ట్ర‌ప‌తి ఏపిజే అబ్దుల్ కలామ్‌కు ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి:  మాజీ రాష్ర్టపతి, భారత రత్న ఏపిజే అబ్దుల్ కలామ్ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ చిత్రపటానికి కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలామ్ భారతదేశ రాష్ర్ట పతి స్ధాయికి ఎదగగలిగారని అప్పిరెడ్డి అన్నారు.ఆయనలోని పట్టుదల,కష్టపడేతత్వం ఆయనను తొలుత శాస్ర్తవేత్తగా,ఆ తర్వాత రాష్ర్టపతి అవగలిగారని తెలియచేశారు. అబ్దుల్ కలామ్ జీవితం అందరికి ఆదర్శం అని వివరించారు.భారత రాష్ర్టపతిగా ఉన్న సమయంలో చాలా సాధారణ జీవితం గడపడమే కాదు....విద్యార్ధులకు,ప్రజలకు వారి జీవితాలలో ఉన్నత స్ధానాలు అధిరోహించాలంటే ఏకాగ్రత,సంకల్పం అవసరమని బోధించారన్నారు.

కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, నాయిబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సిధ్దవటం యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top