నంద్యాల: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జనం మధ్యలో లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఎధిక్స్ కమిటీ చైర్మన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కొనియాడారు. మహానేత వైయస్ఆర్ 14వ వర్ధంతి కార్యక్రమం నంద్యాల జిల్లా నల్లకాల్వ సమీపంలోని వైయస్ఆర్ స్మృతివనంలో ఘనంగా నిర్వహించారు. మహానేత విగ్రహానికి, చిత్రపటానికి ఎమ్మెల్యే శిల్పా, వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరధుడు, రైతు బాందవుడు, ఆరోగ్య శ్రీ ప్రదాత, విద్యా విధాత, ఓటమి ఎరుగని ధీరుడు, దివంగత నేత మనందరి ప్రియతమ నాయకుడు మహానేత వై యస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిద్దాం. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచి రాజకీయ జీవితంలో ఓటమెరుగని దీరుడిగా హిస్టరీ క్రియేట్ చేశారని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2003లో పాదయాత్ర ప్రారంభించి 1460 కిలోమీటర్లు మండుటెండల్లో నడిచి ప్రజల కష్టాలను రైతుల కష్టాలను విద్యార్థుల కష్టాలను తెలుసుకున్నారని చెప్పారు. ఆయన పాదయాత్రలో రైతులకు మొదటి హామీగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. 2004 ఎన్నికలలో గెలుపొందడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సంతకం ఆరోజు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్ ఫైల్ పై చేసి తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆర్థిక పరిస్థితుల కారణంగా అనారోగ్యంతో చనిపోతున్నారని ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని పథకాన్ని తీసుకొని వచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 108, 104 అంబులెన్స్ లని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టి ఉన్నత చదువులు చదివించారని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గురించి ఆలోచించే ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ నాలుగు అడుగుల ముందుకేసి అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు. 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైయస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.