సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో గిరిజ‌న ప్రాంత ఎమ్మెల్యేలు భేటీ

అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై సీఎంతో చ‌ర్చ‌

అసెంబ్లీ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గిరిజన ప్రాంతాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యేలు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ స‌మావేశంలో డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top