రాష్ట్ర‌మంతా రావాలి జ‌గ‌న్.. మ‌ళ్లీ కావాలి జ‌గ‌న్ అంటోంది

అమ‌లాపురం స‌భ‌లో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

అమ‌లాపురం: వైయ‌స్ఆర్ ఆస‌రా పెన్ష‌న్ అందుకుంటున్న అవ్వాతాత‌లు, సంక్షేమ ప‌థ‌కాలు అందుకుంటున్న అక్క‌చెల్లెమ్మ‌లు, ప్రతి ఒక్కరూ కూడా `మా భవిష్యత్‌ నువ్వే జగన‌న్న‌` అంటున్నారని ర‌వాణా శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ చెప్పారు. అమ‌లాపురం స‌భ‌లో మంత్రి విశ్వ‌రూప్ మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్న‌ప్పుడు రూ. 50, రూ. 70 పెన్ష‌న్ ఇచ్చేవాడ‌ని, దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చినట్లు పెన్షన్‌ను రూ. 200 చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 14 లక్షల పెన్షన్లు ఇస్తే వైయ‌స్‌ఆర్‌ ఐదేళ్ళలో దాదాపు 64 లక్షల పెన్ష‌న్లు ఇచ్చార‌ని చెప్పారు. ఐదేళ్ళలో 50 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత వైయ‌స్‌ఆర్‌దని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన పెన్షన్లు 30 లక్షలు అయితే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దాదాపు 63 లక్షల మందికి ఇస్తున్నార‌ని చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారని, వైద్య ఆరోగ్య శాఖ‌లోనూ ఉద్యోగాలు క‌ల్పించార‌ని చెప్పారు. ఏపీలో ఒక నాయకుడు హలో ఏపీ బైబై వైసీపీ అంటున్నాడు, ఎందుకు బైబై చెప్పాలి, అమ్మ ఒడి ఇస్తున్నందుకా..? లేక సంక్షేమ పథకాలు పార‌ద‌ర్శ‌కంగా ఇస్తున్నందుకా..? అని ప్ర‌శ్నించారు. ఏపీ ప్రజలంతా రావాలి జగన్‌ మళ్ళీ కావాలి జగన్ అంటున్నార‌ని మంత్రి పినిపే విశ్వ‌రూప్ చెప్పారు.

Back to Top