పారదర్శకంగా ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రూ.12,500 పెట్టుబడి సాయం అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు నేరుగా ఇంటికెళ్లి రశీదులు అందజేయనున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా 50 లక్షలకుపైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల కష్టాలు తీర్చాలని సీఎం వైయస్‌ జగన్‌ భావించారని, ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకుంటున్నారన్నారు. పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని, అక్టోబర్‌ 15 తరువాత కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. 
 

Back to Top