మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

అవినీతి రహిత సంక్షేమ పాలన సాగాలి

మనం వేసే ప్రతి అడుగులో గ్రాఫ్‌ పెరగాలి

రేపు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ విస్తరణ

మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు

వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశంలో సీఎం జగన్‌ దిశానిర్దేశం

తాడేపల్లి:రాష్ట్ర మొత్తం మన వైపు చూస్తోందని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశనం చేశారు. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలన్నారు.అవినీతికి ఏ మాత్రం తావివ్వకుండా పాలన జరగాలన్నారు.హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి  అడిగా..ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.ప్రతి కాంట్రాక్టు ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళ్తుందన్నారు.ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రకియ ఉంటుందన్నారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు చేస్తామన్నారు.

ఆరోపణలొచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేపడతామన్నారు.రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామన్నారు.బాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారన్నారు.ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరుకు తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నామన్నారు.అర్హత ఉన్న చివరి వ్యక్తి వరుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలన్నారు.

నామినేషన్‌ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు 50 శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలిపారు. రేపు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలిపారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలేనని తెలిపారు.మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఉంటుందన్నారు.  రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని వెల్లడించారు.రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

 

తాజా ఫోటోలు

Back to Top