సీఎం వైయస్‌ జగన్‌తో యువ ఐఏఎస్‌ల భేటీ

తాడేపల్లి: కేటాయించిన శాఖల్లో అవగాహన, అనుభవం పెంచుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువ ఐఏఎస్‌లకు సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2018 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి కేటాయించిన శాఖలపై యువ ఐఏఎస్‌లు సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. ∙ప్రజంటేషన్‌ ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లను సీఎం అభినందించారు. కేటాయించిన శాఖల్లో అవగాహన, అనుభవం పెంచుకోవాలని, వ్యవస్థల్లో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు. అనుభవజ్ఞులైన అధికారుల నుంచి వారి మార్గనిర్దేశం తీసుకోవాలని సూచించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top