చంద్రబాబు వెధవ పనులు, అప్పులతో రాష్ట్రం నష్టపోయింది

అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనేది మా విధానం

విశాఖ గ‌ర్జ‌న ర్యాలీలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు చేసిన వెధవ పనులు, అప్పుల వల్ల ఆంధ్రరాష్ట్రం నష్టపోయిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ నిర్వహిస్తున్న ‘విశాఖ గర్జన’ భారీ ర్యాలీలో మంత్రి ఆర్కే రోజా పాల్గొని మాట్లాడారు. లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతాలు కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరో 4 లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టి అందరికీ అన్యాయం చేయడం కంటే రూ.10 వేల కోట్లతో విశాఖలో పరిపాలన రాజధాని చేయడం, కర్నూలులో న్యాయరాజధాని పెట్టి అందరికీ సమానంగా న్యాయం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top