సీట్ల కేటాయింపులో బీసీలకు వైయస్‌ఆర్‌సీపీ సముచిత స్థానం

బీసీలకు 41 సీట్లు కేటాయింపు..

బీసీలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: బీసీలకు 41 సీట్లు ఇచ్చామని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లా  ఇడపులపాయలో వైయస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు బలిజ వారిని కూడా బీసీల లిస్ట్‌లో చేర్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గతంలో కంటే ఒక స్థానం ఎక్కువగా ఐదుస్థానాలను ముస్లిం సోదరులకు కేటాయించడం జరిగిందన్నారు.ప్రజాభిప్రాయం, సర్వేల మేరకు మార్పులు చేశామన్నారు.చంద్రబాబు బీసీలకు సీట్లు ఇవ్వకుండా ఇచ్చినట్లుగా మభ్య పెట్టి సంఖ్యను మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు.ప్రజలందరూ తమ ఆశీస్సులతో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

Back to Top