టీడీపీ నేతల దోపిడీని సీఎం దృష్టికి తీసుకెళ్తాం

రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పోల‌వ‌రం సంద‌ర్శ‌న 

క‌మిష‌న్ల కోస‌మే  ప‌ట్టిసీమ

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

పశ్చిమగోదావరి: రేపు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం సందర్శిస్తారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు.పోలవరం నియోజకవర్గ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో టీడీపీ నేతలు చేసిన దోపిడీని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని సీఎం కోరనున్నట్లు తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ‘పోలవరం సోమవారం’ చేశారన్నారు. కమిషన్స్‌ కోసమే పట్టిసీమను కట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో పోలవరం పూర్తిచేస్తామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top