రేపు వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం 

 అమరావతి:వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని  ఈ నెల 12న ఘనంగా నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న వైయస్‌ఆర్‌సీపీ 8 వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సాన్ని రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు,అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా,మండల కేంద్రాల్లో ఘనంగా జరపాలని విజయసాయిరెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top