కొండ‌వీడులో రేపు వైయస్ఆర్‌ సీపీ నిజనిర్ధారణ కమిటీ ప‌ర్య‌ట‌న‌

రైతు కోట‌య్య కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌
 

అమ‌రావ‌తి:  గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ పార్టీ శ్రేణుల‌కు ఆదేశాలు జారీ చేశారు. కోట‌య్య మ‌ర‌ణంపై వాస్త‌వాలు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు నేతృత్వం వ‌హిస్తారు. ఈ మేర‌కు ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం కమిటీ స‌భ్యులు కొండవీడులో పర్యటిస్తారు.  

కమిటీలో సభ్యులుగా గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు శాసన సభ్యులు( ముస్తఫా,  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  ఆళ్ల రామకృష్ణారెడ్డి)లతోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యన్నారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, రజని,  కృష్ణదేవరాయలు,  జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ,  లేళ్ల అప్పిరెడ్డి,  గాంధీ,  మేరుగ నాగార్జున ఉంటారు. బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారికి అండగా నిలబడాలని వైయ‌స్ జగన్‌ పార్టీ నాయకులను ఆదేశించారు.

Back to Top