రేపు రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొననున్న సీఎం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (26.01.2024) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వ‌హిస్తున్న‌ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 

ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌..
రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొని అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగు పయనమ‌వుతారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. రిప‌బ్లిక్ వేడుక‌ల సంద‌ర్భంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియం, ప్ర‌ధాన వీధులు, తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యాన్ని విద్యుత్ దీపాల‌తో అందంగా అలంక‌రించారు.
 

Back to Top