నేటి నుంచి వైయస్‌ షర్మిల బస్సుయాత్ర

వైయస్‌ షర్మిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సాయంత్రం 5.30 గంటలకు మంగళగిరిలో బహిరంగ సభ

అమరావతి: నేడు తాడేపల్లి నుంచి  వైయస్‌ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరిలో వైయస్‌ షర్మిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రు కమల,బుట్టా రేణుక,ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొనున్నారు. ర్యాలీ అనంతరం రైతులతో వైయస్‌ షర్మిల ముఖాముఖిగా మాట్లాడతారు. బలవంతపు భూసేకరణతో దగాపడ్డ రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు,అనంతపురం పుసుపు రైతుల సమస్యలను కూడా తెలుసుకుంటారు.సాయంత్రం 5.30 గంటలకు మంగళగిరిలో వైయస్‌ షర్మిల బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 

Back to Top