ఇండియా టుడే సదస్సుకు వైయ‌స్‌ జగన్‌

నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రతిపక్ష నేత
 

 అమరావతి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.  

 

Back to Top