నేడు ఢిల్లీకి వైయస్‌ జగన్‌ బృందం...

ఓటర్ల జాబితా అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు..

హైదరాబాద్‌: ఓటర్ల జాబితా అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీ సమాయత్తం అవుతుంది. నేడు సాయంత్రం  వైయస్‌ జగన్‌ బృందం ఢిల్లీ వెళ్లనుంది. వైయస్‌ జగన్‌ వెంట  మాజీ ఎంపీలు,ముఖ్యనేతలు వెళ్లనున్నారు. రేపు ఉదయం సీఈసీని వైయస్‌ జగన్‌ బృందం కలవనుంది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు వైయస్‌ జగన్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన బయల్దేరుతున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలను కలుపుకుని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేస్తారని సమాచారం. 

Back to Top