నేడు గుంతకల్లులో ‘సాధికార’ బస్సుయాత్ర

 అనంత‌పురం జిల్లా:  సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర మంగళవారం గుంతకల్లులో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని మెయిన్‌ రోడ్డు వైయ‌స్ఆర్ సర్కిల్‌లో సభ జరగనుంది. ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలితో పాటు ప్రధాన రహదారులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. వైయ‌స్ జ‌గన్‌ పాలనలో బడుగు, బలహీనవర్గాలకు చేకూరిన ప్రయోజనాలను వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్న లక్ష్యంతో బస్సు యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్‌, మాజీ మంత్రులు శంకరనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీలు రంగయ్య, నందిగం సురేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు సినీనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ హాజరు కానున్నారు.

బస్సు యాత్ర విజయవంతం చేయండి
గుంతకల్లులో మంగళవారం జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రకు నియోజకవర్గం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో పాటు వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన సంక్షేమ రథసారథి జగనన్నేనని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మైమూన్‌, మాజీ చైర్మన్‌ రామలింగప్ప, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో– ఆప్షన్‌ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top