వైయస్‌ఆర్ జిల్లా: మూడు రోజుల వైయస్‌ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో దాదాపు రూ.3 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.1272 కోట్లతో గాలేరు – నగరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, కాలేటి వాగు, వెలిగల్లులకు నీటి సరఫరా, ఝురికొన నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంబేపల్లెకి నీటి సరఫరా. వెలిగళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. రూ.1.50 కోట్లతో శ్రీవీరభద్రస్వామి ఆలయ ఐదు అంతస్థుల రాజగోపురం ముఖ ద్వారాలు. రాయచోటి ఏరియా ఆస్పత్రి 100 పడకలుగా అప్‌గ్రేడ్. ఆస్పత్రిలో రూ.23 కోట్లతో నూతన భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, మైనార్టీ ఐటీఐతో పాటు రూ.10 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల, 18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, రూ.12 కోట్లతో సోషల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అంతేకాకుండా రూ.6.60 కోట్లతో రాయచోటి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు. రూ.340.60 కోట్లతో రాయచోటి పట్టణంలో భూగర్భ డ్రైనేజీ, రూ.98 కోట్లతో తాగునీటి సరఫరా, రూ.3 కోట్లతో అధునాతన భూసార పరీక్షా కేంద్రం, రూ.58 లక్షలతో ఎంపీడీఓ కార్యాలయానికి నూతన భవనాలు, 125 ఎకరాల్లో 6 వేల మందికి ఇంటి నివాస స్థలాలు పంపిణీ వంటి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.