నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

 విశాఖపట్నం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.  మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ముఖ్య‌మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సభలో సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. పైలాన్‌ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో కాసేపు మాట్లాడి, వారితో ఫొటోలు దిగనున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారులతో మాట్లాడతారు.  

Back to Top