సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టొబాకో బోర్డు చైర్మన్‌

తాడేపల్లి: ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా మార్కెటింగ్‌లో జోక్యం చేసుకోవడం వల్ల పొగాకు రైతులకు మంచి ధర లభించిందని టొబాకో బోర్డు చైర్మన్‌ రఘునాథ్‌ బాబు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టొబాకో బోర్డు చైర్మన్‌ రఘునాథ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ చొరవతో రైతులకు మంచి ధర లభించిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పొగాకు రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం చేకూరిందని సీఎంకు వివరించారు. టొబాకో రైతుల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు రఘునాథ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top