తిరుపతి లోక్‌సభ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తి

చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున డాక్టర్‌ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానానికి గురుమూర్తిని వైయస్‌ఆర్‌సీపీ ఉప ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వచ్చే నెల 17న నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మే 2వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్హులు జారీ చేసిన విషయం విధితమే.
 

Back to Top