తొక్కిసలాటకు చంద్ర‌బాబుదే బాధ్యత

టీటీడీ మాజీ చైర్మ‌న్‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి

టీటీడీ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది

టీటీడీని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు

చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

ఈవో, జేఈవోలను సస్పెండ్‌ చేయాలి

తిరుపతి:  పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని, ఈ ఘ‌ట‌నకు చంద్ర‌బాబు పూర్తి బాధ్య‌త వ‌హించాల‌ని టీటీడీ మాజీ చైర్మన్‌, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్‌ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇవాళ  ఉదయం చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో క‌లిసి భూమ‌న మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాజకీయక్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పశువుల మంద మాదిరి తొసిపారేశారు.  ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన.  ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఈవో, జేఈవోలను సస్పెండ్‌ చేయాలి.

సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైయ‌స్ఆర్‌సీపీని, వైయ‌స్‌ జగన్‌పై అసత్య ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నార‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Back to Top