అణిచివేతధోరణి అప్రజాస్వామికం...

 సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్‌ చేయిస్తారా..

–వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

 

అనంతపురం:సమస్యలు చెప్పుకోవడానికి వస్తే డ్వాక్రా మహిళలను అరెస్ట్‌ చేయడం పట్ల రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఖండించారు.గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలిస్తామని హామీలిచ్చి టీడీపీ ప్రభుత్వం ఓట్లు వేయించుకుందని,అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా డ్వాక్రా మహిళలను అప్పుల్లోకి నెట్టిందన్నారు.మంత్రి సునీతను అడ్డుకోవాలనేది మహిళల టార్గెట్‌ కాదని.సమస్యలు చెప్పుకోవడానికే వచ్చారన్నారు.మంత్రి సునీత అణిచివేతధోరణితో మహిళలను భయబ్రాంతులను చేయడానికి అరాచకం సృష్టిస్తున్నారన్నారు.ఒక్కొ మహిళలకు సుమారు రూ.70వేలు నుంచి 75 వేలు వరుకూ రుణాలను మాఫీ చేయాలన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ  చేయకుండా..మళ్లీ ఎన్నికల ముందు చెక్కుల పేరుతో చంద్రబాబు ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు.మరోసారి మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులతో మహిళలను  అరెస్ట్‌ చేయించడం అన్యాయమన్నారు.ఎన్నికల హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

Back to Top