సీఎంకు కృతజ్ఞతగా విద్యార్థుల ప్రదర్శన

గుంటూరు: రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో శనివారం గుంటూరులో విద్యార్థులు భారీ కృతజ్ఞత ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.  లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం విధితమే. రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మహోత్తర ప్రక్రియ విజయవంతం కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 

Back to Top