సీఎం వైయ‌స్ జగన్‌కు గుంటూరు ప్రజాప్రతినిధులు కృత‌జ్ఞ‌త‌లు

అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను కలిశారు. పల్నాటి ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే వరికపూడిశెల ప్రాజెక్టుకు ఈఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు సీఎంకు  వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు ఉన్నారు.

Back to Top