సీఎం వైయస్‌ జగన్‌కు రాజధాని రైతులు కృతజ్ఞతలు

అమరావతి: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా చేస్తూ..రాజధానికి భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు పెంచడం పట్ల ఇవాళ ఉదయం సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు,  రాజధాని గ్రామాల్లో భూమిలేని రైతు కూలీలకు ఇస్తున్న రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచినందుకు...రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌ రైతుల భూములకు సామాన ప్యాకేజీ  నిర్ణయించినందుకు... మందడం, తాళ్లాయపాలెం జంక్షన్ వద్ద  ముఖ్యమంత్రి  వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు.  

Back to Top