ఒడిశా సీఎంకు వైయ‌స్ జ‌గ‌న్ లేఖ రాయ‌డం హ‌ర్ష‌నీయం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లేఖ‌

శ్రీ‌కాకుళం: వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి శ్రద్ధ చూపుతూ ఒడిశా ముఖ్యమంత్రికి గౌరవ ఏపీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు లేఖ రాయడం హర్షనీయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్  జ‌గ‌న్‌కు ఆయ‌న సోమ‌వారం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ లేఖ రాశారు. చిక్కోలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరే క్రమంలో ఈ చర్య అత్యంత కీలక మలుపుగా భావిస్తున్నాను. వెనుకబడిన ప్రాంత పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, వంశధార ప్రోజెక్టు పూర్తి కావడం వలనే సాధ్యమవుతుందని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు శతశాతం మేనిఫెస్టో అమలుకు అంకితమవుతూనే ప్రాధాన్యత ప్రోజెక్టులలో వంశధారను చేర్చడం, సమస్యల పరిష్కారానికి కృషిచేయడం, తన సుపరిపాలనకు చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొంటూ ఈ ప్రాంత రైతాంగం, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

జిల్లా పురోగతికి అవసరమైన నేరడి బ్యారేజీ నిర్మాణం, వంశధార రిజర్వాయరు, తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేయడం. వంశధార ప్రధాన కాలువల పనులు, నాగావళి - వంశధార కరకట్టలు పూర్తి చేయడం వంటి అత్యంత ప్రజావసరమైన ఈ మూడు పెండింగ్ పనులు మీ హాయాంలోనే పూర్తి చేయగలరని నమ్ముతున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి అభివృద్ధి చెందిన జిల్లాల సరసన శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టే గొప్ప ముఖ్యమంత్రిగా గౌరవ వైయ‌స్ జ‌గ‌న్ గారు చరిత్రలో నిలిచిపోతారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయాలన్న ధృడ సంకల్పంతో ప్రతిష్టాత్మక జలయజ్ఞం పథకంలో భాగంగా వంశధార ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి 933 కోట్లు మంజూరు చెయ్యడం ఓ చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలు, రాజశేఖరరెడ్డి సంకల్పం తన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చొరవతోనే సాధ్యం. ఇచ్చిన మాటకు కట్టుబడేతత్వం ప్రజా సంక్షేమం పట్ల పట్టుదల మేనిఫెస్టోను ప్రమాణంగా భావించే విధానం గల ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వల్లనే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా మారుతుందని విశ్వసిస్తున్నాను అంటూ లేఖ‌లో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top