ఆరుద్ర‌ను ఆదుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాజులపూడి ఆరుద్రతో  సమావేశమైన సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ 

సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించాల‌ని సీఎం ఆదేశాలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఆరుద్ర 

తాడేప‌ల్లి:  వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ 2 రోజుల క్రితం సీఎం కార్యాలయానికి నివేదించిన కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్రను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదుకున్నారు.     సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ మరోసారి సమావేశమ‌య్యారు.  నిన్న విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను పరామర్శించిన ఎన్టీఆర్‌ జిల్లాకలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ.  ఆరుద్రతో మాట్లాడిన అంశాలను నివేదించిన అధికారులు.

 •  మరోమారు ఆమెతో మాట్లాడి, సమస్యలను పరిష్కారించాలంటూ తన కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని ఆదేశించిన సీఎం.  సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తీసుకు వచ్చిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు.  ఆరుద్రతో మాట్లాడిన ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి.     సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, ఆమేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారని తెలిపిన ధనుంజయ్‌ రెడ్డి.
 •  ఎంత ఖర్చైనా భరించాలంటూ సీఎం చాలా స్పష్టంగా చెప్పారంటూ ఆరుద్రకు వివరించిన ముఖ్యమంత్రి కార్యదర్శి. 
 •  జీవనోపాధి కల్పించేందుకు ఉద్యోగం కల్పిస్తామని వెల్లడి.
 •  ఆరుద్ర సమక్షంలో నేరుగా కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు. 
 •  తనకున్న స్థిరాస్థిని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎవరైనా అలాంటి పరిస్థితులను సృష్టిచేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనికూడా స్పష్టీకరణ.
 •      ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై ఇప్పటికే శాఖాపరంగా చర్యలు తీసుకున్నారని వెల్లడి, 
 •  ఈ మేరకు ఆరుద్ర సమక్షంలోనే కాకినాడ ఎస్పీకి ఆదేశాలు.
 •  ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటుందని, ఎలాంటి నిరాశకు గురికావొద్దని, ధైర్యంగా ఉండాలని ఆరుద్రకు భరోసా నిచ్చిన ముఖ్యమంత్రి కార్యదర్శి.
 • ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు
 •  తనలాంటి అసహాయులుకు ముఖ్యమంత్రిగారు చాలా అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకం నాకున్నాయన్న ఆరుద్ర.
 •  అందుకనే నేను ఇక్కడకు వచ్చానన్న ఆరుద్ర.
 •  తన కుమార్తె వైద్యానికి పూర్తి ఖర్చులను భరిస్తాననడం సంతోషకరమని సీఎంఓ అధికారులతో అన్న ఆరుద్ర. 
 •  ఉపాధికోసం ఉద్యోగం కల్పిస్తామనడంపైనా ఆనందం వ్యక్తంచేసిన ఆరుద్ర. 
 •  రెండు రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు యోగక్షేమాలు కనుక్కుంటూ, పరామర్శిస్తూ బాగోగులు చూసుకున్నారన్న ఆరుద్ర.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top