మాతాశిశు మరణాలు తగ్గించేందుకు పౌష్టికాహారం అందిస్తున్నాం

మంత్రి తానేటి వనిత

అమరావతి: మాతాశిశు మరణాలు తగ్గించేందుకు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల ఆరోగ్యం పట్ల వైయస్‌ జగన్‌ శ్రద్ధ తీసుకున్నారు. గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడకూడదు. మాతాశిశు మరణాలు తగ్గించాలని అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందించేందుకు ఎక్కువ నిధులు కేటాయించారు. ఫ్రీ స్కూల్‌ విద్యార్థులు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండాలని పౌష్టికాహారం అందిస్తున్నాం. మనం వచ్చిన ఈ రెండేళ్లలో రూ.3998 కోట్లు మహిళల పౌష్టికాహారానికి ఖర్చు చేశాం. గత ప్రభుత్వంలో అరకొరగా నిధులు కేటాయించారు. కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మా ప్రభుత్వంలో గర్భిణులను మొదటి నెల నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చూడకుండా అందరికీ పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. 25 రోజుల పాటు గుడ్డు, పౌష్టికాహారం ఇస్తున్నాం. 6 నెలల నుంచి మూడేళ్ల వరకు బాలామృతం కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ సెంటర్లు పౌష్టికాహారం అందించే కేంద్రాలే కుండా చక్కటి వాతావరణంలో విద్యనందించేందుకు పీ1, పీ2 క్లాసెస్‌ నిర్వహిస్తున్నాం. వీడియోల ద్వారా టీచర్లకు శిక్షణా తరగతులు ఇచ్చాం. డిపార్ట్‌మెంట్‌ ద్వారా అన్ని సౌకర్యాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కరోనా విపత్తు వల్ల కేంద్రాలు ఓపెన్‌ కాకపోయినా ఇంటింటికీ వెళ్లి రేషన్‌ఇచ్చాం. ఎక్కడైనా లోపాలు ఉన్నా సరిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తానేటి వనిత తెలిపారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top