రాజ‌ శ్యామ‌ల‌ అమ్మవారికి సీఎం వైయస్‌ జగన్‌ పూజలు

 

విశాఖ: విశాఖపట్నం చినముషిడివాడలోని శారదాపీఠంలోని రాజ్యశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం వైయస్‌ జగన్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమంత్రికి స్వరూపానందేంద్రస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సీఎంను పూలమాలలతో సత్కరించారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యేలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top